RRB Group D Jobs | భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకుంటున్న నిరుద్యోగులకు అలర్ట్. ఇండియన్ రైల్వేస్‌లో 1,03,769 ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్ జరగనుంది.
1. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నుంచి ఇటీవల జాబ్ నోటిఫికేషన్లు రాలేదు. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షల్ని నిర్వహిస్తోంది.
2. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2019 లో రిలీజ్ చేసిన గ్రూప్ డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంకా పరీక్షలు జరగలేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రైల్వేలో 1,03,769 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పరిధిలో 9328 పోస్టులు ఉన్నాయి.
3. ఇంటర్మీడియట్ అర్హతతో 1,03,769 ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టుల్ని భర్తీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా కోటి 15 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ అభ్యర్థులంతా పరీక్ష తేదీల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
4. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ పరీక్షలు త్వరలో జరిగే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై ఆర్ఆర్‌బీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC నియామక ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 31న ఏడో దశ పరీక్షలు జరిగాయి.
5. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్ఆర్‌బీ దశలవారీగా పరీక్షల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు ముగిసిన తర్వాత ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టులకు పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
6. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎస్ అండ్ టీ డిపార్ట్‌మెంట్స్‌లో హెల్పర్, అసిస్టెంట్, లెవెల్ 1 పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,03,769 ఖాళీలు ఉన్నాయి.
7. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ నియామక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్.
8. త్వరలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత అడ్మిట్ కార్డులు, ట్రావెల్ పాస్‌కు సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
No comments:
Post a Comment