West Central Railway Recruitment 2021 | రైల్వేలో స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
పలు ఖాళీల భర్తీకి భారతీయ రైల్వే మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC (గ్రాడ్యుయేట్) పోస్టుల్ని భర్తీ చేయనుంది పశ్చిమ మధ్య రైల్వే. అంటే ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగులుగా ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 25 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.
West Central Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- మొత్తం స్టేషన్ మాస్టర్ పోస్టుల సంఖ్య- 38
- దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 26
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 25
- విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.
- వయస్సు- 2021 జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 43 ఏళ్లు.
- ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.
West Central Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా
- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- About us లో Recruitment సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీలో Railway Recruitment Cell పైన క్లిక్ చేయాలి.
- GDCE Notification No. 01/2021 పైన క్లిక్ చేయాలి.
- Click Here for Link పైన క్లిక్ చేస్తే దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది.
- అందులో New Registration పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
- ఆ తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కోడ్ లేదా పీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత పుట్టిన తేదీ, క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి.
- Continue పైన క్లిక్ చేసి మిగతా దరఖాస్తు పూర్తి చేయాలి.
- ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
- మొబైల్ నెంబర్, ఇమెయిల్‌కు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.
- ఆ వివరాలతో లాగిన్ కావాలి.
- ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ అఫ్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment