1. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB ఓ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పెంచింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని భర్తీ చేస్తోంది DSSSB. దరఖాస్తు గడువు జూలై 3న ముగిసింది. దీంతో దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం లభించింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల చివరి తేదీని 2021 జూలై 10 వరకు పొడిగించింది.
2. ఆసక్తిగల అభ్యర్థులు 2021 జూలై 10 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్లలో అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.
3. మొత్తం 5,807 ఖాళీలు ఉన్నాయి. టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159, టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961, టీజీటీ పంజాబీ ఫీమేల్- 492, టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571, టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1, టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029, టీజీటీ సంస్కృతం మేల్- 866, టీజీటీ ఉర్దూ మేల్- 346, టీజీటీ పంజాబీ మేల్- 382 పోస్టులున్నాయి.
Amazon SmartPhone Upgarde Sale
4. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. టియర్ 1, టియర్ 2 ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో LINK FOR ONLINE APPLICATION REGISTRATION SYSTEM (OARS) లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.
6. కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది. అందులో Click for New Registration పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment