ఇస్రో నుంచి అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ISRO నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 43 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2018, 19, 20, 21 సంవత్సరాల్లో బీఈ, బీటెక్ లేదా డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. అయితే వారిని పర్మినెంట్ చేసే అవకాశం లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. డిప్లొమో అప్రంటీస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేలు, గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేలను ఉపకారవేతనంగా చెల్లించనున్నారు.
ఎవరు అప్లై చేయాలంటే..
ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని ఫస్ట్ క్లాసులో పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లో బ్రాంచుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
-సివిల్ ఇంజనీరింగ్ - 3
-మెకానికల్ ఇంజనీరింగ్ - 1
-కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 1
-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 1
-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 3
-ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 2
- టెక్నాలజీ అండ్ సేఫ్టీ - 2
డిప్లొమో చేసిన అభ్యర్థులకు విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
-సివిల్ ఇంజనీరింగ్ - 3
-మెకానికల్ ఇంజనీరింగ్ - 2
-కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 2
-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-3
-డిప్లొమో ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ -21
అభ్యర్థులు ఎలా అప్లై చేయాలంటే
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా MHRDNATS పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, డిప్లొమో సర్టిఫికేట్లను సబ్మిట్ చేసిన అనంతరం ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ అవుుతుంది. అనంతరం అప్లికేషన్ ఫామ్ ను అభ్యర్థులు hqapprentice@isro.gov.in ఈ మెయిల్ కు ఈ నెల 22లోగా పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్ సబ్జెక్ట్ లో “Application for the Apprenticeship Category” అని రాయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
No comments:
Post a Comment