ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇడియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారుల ఉద్యోగాల కు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, అర్హతల వివరాలు:
-ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్ సర్వీస్ (జీఎస్)-ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో BE/BTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. -నోటిఫికేషన్లో సూచించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు జనవరి 2, 1997 నుంచి జులై 1, 2002 మధ్యలో జన్మించి ఉండాలి.
-కేవలం అవివాహితులైన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Official Website - Direct Link
ఇతర వివరాలు
-వాస్తవానికి ఈ ఉద్యోగాల భర్తీకి ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
-ఇంటర్వ్యూలను ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్నారు.
-ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఇండియన్ నేషనల్ అకాడమీ, ఎజిమళలో శిక్షణ ఇవ్వనున్నారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివనాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
No comments:
Post a Comment