Indian Army Officer Recruitment 2021 | ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెరిటోరియల్ ఆర్మీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే జూలై 20న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jointerritorialarmy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారిని లెఫ్టనెంట్ ర్యాంకులో నియమిస్తారు.
Indian Army Officer Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 20
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 19
- పరీక్ష తేదీ- 2021 సెప్టెంబర్ 26
Indian Army Officer Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
- వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు
- దరఖాస్తు ఫీజు- రూ.200
- ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్
- పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, పూణె, కోల్‌కతా, డార్జిలింగ్, గువాహతి, దిమాపూర్, చండీగఢ్, జలంధర్, షిమ్లా, ఢిల్లీ, అంబాలా, హిసర్, లక్నో, అలాహాబాద్, ఆగ్రా, భువనేశ్వర్, డెహ్రడూన్, ఉదంపూర్, శ్రీనగర్, నగ్రోటా
- వేతనం- రూ.1,77,500 వరకు
Indian Army Officer Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా
- ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://www.jointerritorialarmy.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.
- Join As An Officer పైన క్లిక్ చేయాలి.
- Register పైన క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ సమయంలో సొంత ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
- అన్ని వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
- లాగిన్ చేసిన తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment