భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శాశ్వత ప్రాతిపదికన గ్రూప్–సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, డ్రైవర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్, హిందీ, ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. ఆ తర్వాత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అందేలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://indianairforce.nic.in
No comments:
Post a Comment