Coast Guard Jobs 2021 | కోస్ట్ గార్డ్‌లో 350 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. కోస్ట్ గార్డ్‌లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూలై 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://joinindiancoastguard.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు తెలుసుకోవాలి.
Indian Coast Guard Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 350
నావిక్ (జనరల్ డ్యూటీ)- 260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)- 50
యాంత్రిక్ (మెకానికల్)- 20
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)- 13
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)- 13
Indian Coast Guard Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 2 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 6 సాయంత్రం 6 గంటలు
విద్యార్హతలు- నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. యాంత్రిక్ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ (రేడియో, పవర్) ఇంజనీరింగ్‌లో 3 లేదా 4 ఏళ్ల కోర్స్ పూర్తి చేయాలి.
వయస్సు- 18 నుంచి 22 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- స్టేజ్ 1, 2, 3, 4 పరీక్షలు ఉంటాయి. పరీక్షా విధానం వేర్వేరు పోస్టులకు వేర్వేరు విధంగా ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వేతనం- నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు రూ.21,700, యాంత్రిక్ పోస్టులకు రూ.29,200 బేసిక్ వేతనంతో పాటు డీఏ, అలవెన్సులు లభిస్తాయి.
Indian Coast Guard Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://joinindiancoastguard.cdac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Upcoming Opportunities పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Click to apply పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Create Account పైన క్లిక్ చేసి వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయాలి.
ఆ తర్వాత లాగిన్ అయి పోస్టు సెలెక్ట్ చేసి దరఖాస్తు చేయాలి.
పనిచేస్తున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి వివరాలన్నీ ఓసారి చెక్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment