ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌ఓ).. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: ఎంపీసీ/బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తోపాటు పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు/బీఎస్సీ(ఆప్టోమెట్రీ)/డిప్లొమా(ఆప్టోమెట్రిక్)/డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో 45 మార్కులు విద్యార్హత(ఇంటర్మీడియట్)లో సా«ధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నికల్ విద్యార్హతలో సాధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు వయసుకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఫస్ట్ ఫ్లోర్, క్యాజువాలిటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రిమ్స్, ఓంగోలు, ఏపీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
No comments:
Post a Comment