BDL Recruitment 2021 | హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 46 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 జూలై 8న ప్రారంభమైంది.
2. జూలై 23 రాత్రి 11 గంటల్లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
3. అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. దరఖాస్తులు పోస్టులో పంపడానికి 2021 జూలై 31 చివరి తేదీ.
4. మొత్తం 46 ఖాళీలు ఉండగా అందులో జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (న్యూ ప్రాజెక్ట్స్)- 3, మెడికల్ ఆఫీసర్- 2, అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)- 3, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్)- 12, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 9, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 3, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్)- 3, మేనేజ్‌మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్)- 2, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఆప్టిక్స్)- 1, మేనేజ్‌మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్‌మెంట్)- 1, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)- 3, మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్ఆర్)- 3 పోస్టులున్నాయి.
5. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, బీడీఎల్ ఉద్యోగులకు ఫీజు లేదు. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇతర పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
6. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ లో నోటిఫికేషన్ ఉంటుంది. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
7. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న దరఖాస్తు ఫామ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
No comments:
Post a Comment