Assam Rifles GD Recruitment 2021 | అస్సాం రైఫిల్స్ 131 పోస్టుల్ని భర్తీ చేేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అస్సాం రైఫిల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ విభాగంలో రైఫిల్‌మ్యాన్, రైఫిల్‌వుమెన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 131 ఖాళీలను ప్రకటించింది. పురుషులకు 75, మహిళలకు 56 పోస్టులున్నాయి. డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు లింక్ యాక్టివేట్ అయింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 25 చివరి తేదీ. కరోనా వైరస్ మహమ్మారి తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆగస్ట్ 24 నుంచి రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది అస్సాం రైఫిల్స్. ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం ఈ పోస్టుల్ని ప్రకటించింది అస్సాం రైఫిల్స్. కరాటే, జూడో, ఫుట్‌బాల్, బాక్సింగ్ లాంటి క్రీడల్లో రాణించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అస్సాం రైఫిల్స్ అధికారిక వెబ్‌సైట్ http://assamrifles.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి.
Assam Rifles GD Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 131
- ఆర్చరీ- 8
- కరాటే- 8
- తైక్వాండో- 9
- జూడో- 18
- ఈక్వెస్ట్రియన్- 14
- ఫెన్సింగ్- 4
- వుషు- 18
- ఫుట్‌బాల్- 14
- బాక్సింగ్- 14
- సెపాక్ తక్రా- 4
- పోలో- 4
- అథ్లెటిక్స్- 6
- షూటింగ్- 10
Assam Rifles GD Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 25
రిక్రూట్‌మెంట్ ర్యాలీ- 2021 ఆగస్ట్ 24 నుంచి
విద్యార్హతలు- గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాస్ కావాలి.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్- అంతర్జాతీయ, జాతీయ, అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు, గేమ్స్ ఫర్ స్కూల్స్ నషనల్ అవార్డ్ విజేతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- క్యాండిడేట్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్.
No comments:
Post a Comment