Andhra Pradesh Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ Synergies Castings Ltd లో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రైనీ ఆపరేటర్, స్కిల్డ్ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, అర్హతల వివరాలు
మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నట్ల నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులోట్రైనీ ఆపరేటర్ విభాగంలో 200 ఖాళీలు, స్కిల్డ్ ఆపరేటర్ విభాగంలో మరో 200 ఖాళీలు ఉన్నాయి.
Trainee Operator: డిప్లొమా(మెకానికల్/మెటలర్జీ/ఎలక్ట్రికల్) చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఐటీఐ(ఫిట్టర్/టర్నర్/మెషినిస్ట్/CNM/DM/Foundry Man, పెయింటర్స్), టెన్త్/ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయస్సు 18-33 ఏళ్లు ఉండాలి. విద్యార్హతల ప్రకారం రూ. 12 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం అందించనున్నారు.
Skilled Operators: ఐటీఐ మరియు డిప్లొమా మెకానికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అనుభవం ఆధారంగా రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా ఈ నెల 11లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇంకా వార్షిక ఇంక్రిమెంట్, ప్రమోషన్లు, వార్షిక బోనస్ తదితర ప్రయోజనాలు ఉంటాయి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఇంటర్వ్యూలను Synergies Casting Limited, Duvvada, VSEZ, Visakhapatnam చిరునామాలో నిర్వహిస్తారు. ఏమైనా సందేహాలుంటే 7989330319 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
No comments:
Post a Comment