యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 838
పోస్టుల వివరాలు..
కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349.
కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ)–184.
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021
రాత పరీక్ష తేది: 21.11.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in
No comments:
Post a Comment