కేరళలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్).. కొచ్చి రిఫైనరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 168
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–120, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–48.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజనీరింగ్.
స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ (ఫుల్‌టైం కోర్సు) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్..
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
స్టైపెండ్: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వూ్య, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021
బీపీసీఎల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in/
No comments:
Post a Comment