IBPS RRB 2021: మొత్తం 12,958 బ్యాంకు ఉద్యోగాలు... పోస్టుల సంఖ్య పెంచిన ఐబీపీఎస్
IBPS RRB Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS భారీగా బ్యాంకు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో భారీగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొదట నోటిఫికేషన్ ద్వారా 10,000 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించినా ఆ తర్వాత పోస్టుల సంఖ్య పెరిగింది. 11,687 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఐబీపీఎస్ తెలిపింది. ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్య 12,958 కు పెంచింది.
3. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు 6.101 నుంచి 6,888 కి, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుల సంఖ్య 4,257 నుంచి 4,716 కి పెరిగాయి. ఈ ఖాళీల వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో తెలుసుకోవచ్చు.
4. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 8న ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూన్ 28 వరకు అవకాశం ఉంది. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్ లేదా సింగిల్ ఎగ్జామ్ ఉంటాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి. 2022 జనవరి నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
5. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఖాళీలను భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టులున్నాయి.
6. అప్‌డేట్ చేసిన ఖాళీల వివరాలతో పాటు, నోటిఫికేషన్ వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
7. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తిచేసినవారు అప్లై చేయొచ్చు.
No comments:
Post a Comment