NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jun 7, 2021

DSSSB TGT Recruitment 2021 @ 5807 Vacancies

  SSK       Jun 7, 2021

Teacher Jobs 2021 | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB భారీగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5,807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని ప్రకటించింది. ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, సంస్కృతం లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 3 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను DSSSB అధికారిక వెబ్‌సైట్ https://dsssb.delhi.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

DSSSB TGT Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 5,807

  • టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159
  • టీజీటీ సంస్కృతం మేల్- 866
  • టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029
  • టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961
  • టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571
  • టీజీటీ ఉర్దూ మేల్- 346
  • టీజీటీ పంజాబీ ఫీమేల్- 492
  • టీజీటీ పంజాబీ మేల్- 382
  • టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1


DSSSB TGT Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 4
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 3
  • విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
  • వయస్సు- 32 ఏళ్లు
  • దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు
  • ఎంపిక విధానం- టియర్ 1, టియర్ 2 ఎగ్జామ్, స్కిల్ టెస్ట్.

DSSSB TGT Recruitment 2021: దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో LINK FOR ONLINE APPLICATION REGISTRATION SYSTEM (OARS) లింక్ పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading DSSSB TGT Recruitment 2021 @ 5807 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...