Coal India Recruitment 2021 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ECL మొత్తం 1086 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ECL ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 1086 పోస్టులు ఉన్నాయి. అందులో అన్‌రిజర్వ్‌డ్- 842, ఎస్‌సీ- 163, ఎస్‌టీ- 81 పోస్టుల్ని కేటాయించారు.
2. ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.ఎంపికైనవారికి ఆరు నెలలు బేసిక్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టింగ్ ఉంటుంది.
3. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూన్ 15 చివరి తేదీ.
4. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.easterncoal.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
5. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి పంపాలి.
No comments:
Post a Comment