NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

May 28, 2021

Power Grid Recruitment 2021

  SSK       May 28, 2021

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35

పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్‌)–30, డిప్లొమా ట్రెయినీ (సివిల్‌)–05.


డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌):

అర్హత: కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా అర్హత లేకుండా బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు.

వయసు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.


డిప్లొమా ట్రెయినీ(సివిల్‌):

అర్హత: కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్‌ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా అర్హత లేకుండా బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు.

వయసు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా మాత్రమే ఎంపికచేస్తారు.


పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులో పార్ట్‌–1లో 120 ప్రశ్నలు టెక్నికల్‌ నాలెడ్జ్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి వస్తాయి. పార్ట్‌–2లో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు వొకాబ్యులరీ, వెర్బల్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజినింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4మార్కు కోత విధిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:15.06.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.powergrid.in

logoblog

Thanks for reading Power Grid Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...