నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 25లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
సీనియర్ మేనేజర్ విభాగంలో 2, అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 7, అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో 4, మెటీరియల్స్ ఆఫీసర్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పనిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ ను నింపి Chief Manager (HR), National Fertilizers Limited, A-11, Sector-24, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh - 201301 చిరునామాకు జూన్ 25లోగా పంపించాల్సి ఉంటుంది.
పూర్తి విరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అధికారిక వెబ్ సైట్: https://www.nationalfertilizers.com/index.php?option=com_content&view=article&id=344&Itemid=123
No comments:
Post a Comment