Govt Jobs 2021 | కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
1. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-NWDA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులున్నాయి.
2. మొత్తం 62 ఖాళీలున్నాయి. సంస్థ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 25 చివరి తేదీ.
3. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-NWDA అధికారిక వెబ్‌సైట్ http://www.nwda.gov.in/ లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.
4. మొత్తం 62 ఖాళీలు ఉండగా అందులో జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 16, హిందీ ట్రాన్స్‌లేటర్- 1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 5, అప్పర్ డివిజన్ క్లర్క్- 12, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2- 5, లోయర్ డివిజన్ క్లర్క్- 23 పోస్టులున్నాయి.
5. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
6. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
7. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.840. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.500. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
No comments:
Post a Comment