MES Recruitment 2021 | మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువు కూడా పెరిగింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES భారీగా ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2021 ఏప్రిల్ 12న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దరఖాస్తు చేయలేనివారికి మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES మరో అవకాశం ఇచ్చింది. దరఖాస్తు గడువును 2021 మే 17 వరకు పొడిగించింది. గతంలో 502 పోస్టుల్ని మాత్రమే ప్రకటించిన మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES పోస్టుల సంఖ్యను పెంచింది. మొత్తం 572 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://mes.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
MES Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 572
- సూపర్‌వైజర్- 458
- డ్రాఫ్ట్‌మ్యాన్- 114
Amazon SmartPhone Upgrade Days Sale
MES Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 22
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 17 అర్ధరాత్రి
- రాతపరీక్ష- 2021 జూన్ 20
- విద్యార్హతలు- డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ పాస్ కావాలి. సూపర్‌వైజర్ పోస్టుకు ఎకనమిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, వేర్‌హౌజింగ్ మేనేజ్‌మెంట్, పర్‌చేసింగ్, లాజిస్టిక్స్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు
- దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
- ఎంపిక విధానం- రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించొచ్చు.
No comments:
Post a Comment