IIT Roorkee Recruitment 2021 | ఐఐటీ రూర్కీ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జీడీఎంఓ, కోచ్, జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ లాంటి గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
2. మొత్తం 139 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మే 11 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iitr.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
3. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు http://nonteaching.iitr.ernet.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
4. మొత్తం 139 ఖాళీలు ఉండగా అందులో ఫైనాన్స్ ఆఫీసర్- 1, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 2, హిందీ ఆఫీసర్- 1, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్- 1, సీనియర్ సైంటిస్ట్ ఆఫీసర్- 1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1, కోచ్- 6, జూనియర్ సూపరింటెండెంట్- 32, ఫార్మాసిస్ట్- 1, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్- 52, జూనియర్ అసిస్టెంట్- 39, డ్రైవర్- 1 పోస్టులున్నాయి.
5. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు- రూ.500.
6. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.iitr.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో For Non Teaching Job Opening Group (A, B & C) లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, సీ నోటిఫికేషన్లు వేర్వేరుగా ఉంటాయి.
7. నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply online for Non Teaching Positions లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Register పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయాలి.
8. రిజిస్ట్రేషన్ పూర్తైన మొదటి స్టెప్‌లో పోస్టుల్ని సెలెక్ట్ చేయాలి. రెండో స్టెప్‌లో బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో స్టెప్‌లో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వివరాలు ఎంటర్ చేయాలి. ఐదో స్టెప్‌లో ఫోటో అప్‌లోడ్ చేయాలి.
9. ఆరో స్టెప్‌లో సంతకం అప్‌లోడ్ చేయాలి. ఏడో స్టెప్‌లో ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) 9. ఆరో స్టెప్‌లో సంతకం అప్‌లోడ్ చేయాలి. ఏడో స్టెప్‌లో ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
No comments:
Post a Comment