APSSDC Free Courses | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC పలు ఉచిత కోర్సుల్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉచితంగా పలు కోర్సుల్ని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC. ఈ వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించింది.
2. మొత్తం 5 కోర్సుల్ని ఉచితంగా అందిస్తోంది APSSDC. ఈ కోర్సులు 2021 మే 24న ప్రారంభం అవుతాయి. వేర్వేరు కోర్సులకు వేర్వేరు టైమింగ్స్ ఉంటాయి. థియరీ సెషన్స్ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ప్రాక్టికల్ సెషన్స్, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర్లోని APSSDC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో ఉంటాయి.
3. ఐటీఐ చదువుతున్న విద్యార్థులతో పాటు ఐటీఐ పాస్ అయినవారు ఈ కోర్సులు చేయొచ్చు. థియరీ, ప్రాక్టికల్ సెషన్స్ విజయవంతంగా పూర్తి చేసి, ఎగ్జామ్స్ పాస్ అయినవారికి సర్టిఫికెట్ లభిస్తుంది.
Amazon Pantry: Monthly Groceries Upto 40% off
4. ఆసక్తి గల అభ్యర్థులు 2021 మే 23 లోగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ఉచిత కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో ఉంటాయి. ఇదే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. మరి APSSDC అందిస్తున్న కోర్సుల వివరాలు తెలుసుకోండి.
5. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ కోర్సు 2021 మే 24 నుంచి 2021 జూన్ 12 వరకు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
6. పీసీబీ డిజైనింగ్ కోర్సు 2021 మే 24 నుంచి 2021 జూన్ 6 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.
7. ఆటో క్యాడ్ మెకానికల్ కోర్సు 2021 మే 24 నుంచి 2021 జూన్ 12 వరకు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
8. బిల్డింగ్ డ్రాఫ్టింగ్ యూజింగ్ ఆటోక్యాడ్ సివిల్ కోర్సు 2021 మే 24 నుంచి 2021 జూన్ 12 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.
9. ఎంఐటీ యాప్ డిజైన్ కోర్సు 2021 మే 24 నుంచి 2021 జూన్ 6 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.
No comments:
Post a Comment