SBI Youth for India Fellowship 2021 | ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ మరోసారి ప్రారంభం కానుంది. ఫెలోషిప్ వివరాలు తెలుసుకోండి.
డిగ్రీ పాస్ అయినవారికి శుభవార్త. గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఫెలోషిప్ అవకాశాన్ని ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ప్రతీ ఏటా 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగం ఇది. ప్రస్తుతం 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎంపికైనవారు 13 నెలల పాటు గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలి. గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యయనం చేయాలి. ప్రముఖ ఎన్‌జీఓ ప్రతినిధులు, నిపుణులు ఫెలోస్‌కి సహకారం అందిస్తారు. ఫెలోషిప్‌కు ఎంపికైనవారికి నెలకు రూ.50,000 ఫెలోషిప్ లభిస్తుంది. ఫెలోషిప్ పూర్తైన తర్వాత సర్టిఫికెట్ లభిస్తుంది. ఫెలోషిప్ పూర్తైన తర్వాత ఎస్‌బీఐ అల్యూమ్నీ, భాగస్వాములు, సంబంధిత సంస్థల్లో సేవలు అందించొచ్చు. ఈ ఫెలోషిప్‌కు అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. పూర్తి వివరాలను https://youthforindia.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
SBI Youth for India Fellowship 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- ఎస్‌బీఐ ఫెలోషిప్ కాలవ్యవధి- 13 నెలలు
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
- అర్హతలు- డిగ్రీ పాస్ కావాలి.
- వయస్సు- 21 నుంచి 32 ఏళ్లు
- ఇతర అర్హతలు- ప్రజలతో మమేకమై సమస్యల గురించి తెలుసుకునే స్కిల్స్ ఉండాలి.
- ఎంపిక విధానం- అభ్యర్థులు ప్రిలిమినరీ దరఖాస్తులో వారి పూర్తి వివరాలు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ వివరించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ అసెస్‌మెంట్ స్టేజ్ ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పూర్తైన తర్వాత పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఉంటాయి. వేర్వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు.
- అధ్యయనం చేయాల్సిన అంశాలు- విద్య, నీటి వనరులు, మహిళా సాధికారత, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, సాంప్రదాయ కళలు, స్వయం పరిపాలన, ఆహార భద్రత, ఆరోగ్యం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవితం.
ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కార్యక్రమం 2011 మార్చి 1న 27 మంది ఫెలోస్‌తో ప్రారంభమైంది. ఇప్పటివరకు 350 మందికి పైగా ఫెలోస్ ఈ ఫెలోషిప్‌ను పూర్తి చేశారు. 25 రాష్ట్రాల్లో 150 పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. ఫెలోషిప్ పూర్తి చేసినవారిలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
No comments:
Post a Comment