SBI Pharmacist Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఫార్మసిస్ట్ విభాగంలో ఖాళీల భర్తీకి తాజాగా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఫార్మసీలో డిప్లొమో(D Pharma) చేసి ఉండాలి.
లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును రూ. 750గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
Upto 97% Off on Udemy Courses. Explore Now!
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు మే 3ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment