నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సంస్థ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ పలు ఎగ్జిక్యూటీవ్, సూపర్ వైజర్, సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ & టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 18. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
ఖాళీల వివరాలు:
- ఎగ్జిక్యూటీవ్-97 పోస్టులు
- సూపర్ వైజర్-27 పోస్టులు
- సీనియర్ టెక్నీషియన్-27 పోస్టులు
- టెక్నీషియన్-15 పోస్టులు
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
వేతనాలు:
- ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
- సూపర్ వైజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు.
- సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల వేతనం చెల్లించనున్నారు.
విద్యార్హతల వివరాలు:
- ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి.
- సూపర్ వైజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిప్లొమా చేసి ఉండాలి.
- సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఐటీఐ చేసి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 65 ఏళ్ల లోపు ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
No comments:
Post a Comment