NHAI Recruitment 2021 | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 42 ఖాళీలున్నాయి. పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in/ లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పోస్టులో పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
Flipkart Cooling Days: ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
NHAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 41
- మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 24
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 12
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6
NHAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 13
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 12 సాయంత్రం 6 గంటలు
- దరఖాస్తులు పోస్టులో పంపడానికి చివరి తేదీ- 2021 ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటలు
- విద్యార్హతలు- బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సర్టిఫైడ్ మేనేజ్‌మెంట అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
- వేతనం- పే స్కేల్ లెవెల్ 10 వర్తిస్తుంది.
- దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075.
NHAI Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా
- అభ్యర్థులు ముందుగా https://nhai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో VACANCIES పైన క్లిక్ చేయాలి.
- DGM (F&A), Manager (F&A) and Dy. Manager (F&A) నోటిఫికేషన్ పక్కన Apply Now పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- New Registration పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
- ఫోటో, విద్యార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
- వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటల్లోగా పంపాలి.
No comments:
Post a Comment