Know Registered Unknown Mobile Numbers on Your Name: మన పేరు మీద మనకు తెలియకుండానే ఫోన్ నంబర్లు ఉండటాన్ని గుర్తించే విధానాన్ని టెలికాం విభాగం ప్రారంభించింది.
Amazon: Upto 50% off on Air Conditioners
మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే చాలామంది కొన్ని పనుల కోసం అక్కడక్కడ ఆధార్ కార్డులు, పాస్ ఫోటోలు ఇచ్చేస్తుంటారు.
వాటి ద్వారా కొందరు కేటుగాళ్లు సిమ్ కార్డులు తెచ్చుకుంటారనే విషయం చాలాసార్లు బయటపడింది. మనకు తెలియకుండానే మన పేరుతో ఫోన్ నంబర్లు ఉంటాయి.
కానీ మన పేరు మీద మొత్తం ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను టెలికాం విభాగం ప్రారంభించింది.
కొందరి పేర్ల మీద వాళ్లకు తెలియకుండానే నంబర్లు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఒక పోర్టల్‌ను ప్రారంభించామని విజయవాడ టెలికాం శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు, దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ వచ్చేస్తాయి.
వాటిలో అవసరం లేనివి, మనకు తెలియకుండానే ఉన్న నంబర్లను సెలక్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీని వల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ చెప్పొచ్చని తెలిపారు.
మొదట ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో ఈ పోర్టల్ సేవలందిస్తుందని.త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
మరి మీరు కూడా ఈ సేవలను వినియోగించుకుని మీ పేరు మీద మీకు తెలియకుండా ఉన్న ఫోన్ నంబర్లకు చెక్ చెప్పే ప్రయత్నం చేసుకోండి.
No comments:
Post a Comment