ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బోనాంజా సేల్ పేరుతో మరో సేల్ ను ప్రారంభించింది. వివిధ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బోనంజా సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. అనేక స్మార్ట్ఫోన్లపై సూపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ ఇండియాలో ఏప్రిల్ 11 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా వివిధ స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 11: ఈ ఫోన్ అసలు ధర రూ. 54,900కాగా, ఈ ప్రత్యేక సేల్ ద్వారా రూ. 46,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.1-ఇంచ్ లిక్విడ్ రెటీనా హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 12-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు నెలకు రూ. 7,834 తో ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా పొందే అవకాశం ఉంది.
Realme X7 Pro: రియల్ మీ ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ లో రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ మరియు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా రూ. 2 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. 64-మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరాను కలిగి ఉంటుంది. 6.5-ఇంచుల ఫుల్-హెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంటుంది . 8GB RAM మరియు 128GB స్టోరేజీ కెపాసిటీని కలిగి ఉంటుంది.
Poco M3: ఈ ఫోన్ ధర రూ. 10,999 వద్ద ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్ తో పాటు 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరాను కలిగి ఉంటుంది. 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు ఈ ఫోన్ ను నెలకు రూ.2 వేలతో ప్రారంభమయ్యే ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. 48-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.
Nokia 5.4: 4జీబీ+64జీబీ మోడల్ ధర రూ. 13,999 కాగా, రూ.6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,499. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ధర ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే ఫ్లిప్ కార్ట్ రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ 6.4-ఇంచ్ HD+ డిస్ప్లే, 48-మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, మరియు 4,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.
Asus ROG Phone 3: దేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ గేమింగ్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. ఈ ఫోన్ 6.59-ఇంచుల ఫుల్-HD+ ఆల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో 8GB + 128GB వేరియంట్ ను రూ. 41,999కు సొంతం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment