భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డిడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డిడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 1074 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
అర్హతల వివరాలు:
జూనియర్ మేనేజర్: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజీనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎగ్జిక్యూటీవ్: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లై/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటీవ్: టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఇతర వివరాలు: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ మే 23. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. టెస్ట్ జూన్ లో నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment