NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 6, 2021

Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  SSK       Apr 6, 2021

Smartphone under Rs.15000 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? ఇటీవల రిలీజ్ అయిన కొత్త మోడల్స్ సహా రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.

  1. Redmi Note 10: రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.11,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,998. రెడ్‌మీ నోట్ 10 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX58 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆక్వా గ్రీన్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. 
  2.  Realme 8: ఇటీవల రియల్‌మీ లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మీ 8 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. 
  3.  Poco X3: పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.14,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999. పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పోకో ఎక్స్3 రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండటం విశేషం. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. . షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 
  4.  Realme 7: రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. రియల్‌మీ 7 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 7 రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్‌మీ 7 బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 64 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. మిస్ట్ వైట్, మిస్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 
  5.  Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,499. ఇక 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499. ఆఫర్‌లో రూ.15,000 లోపే కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్+5 మెగాపిక్సెల్ టెర్టియర్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. బ్యాటరీ 6,000ఎంఏహెచ్. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ప్యూజన్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
  6.  Moto G9 Power: మోటో జీ9 పవర్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటో జీ9 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటో జీ9 పవర్ రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. 
  7.  Samsung Galaxy A21S: సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ బ్యాటరీ 5,000ఎంఏహెచ్. బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో కొనొచ్చు. 
  8.  Redmi Note 9 Pro Max: రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ + 8 వైడ్ యాంగిల్ + 5 మ్యాక్రో + 2 డెప్త్ సెన్సార్‌తో రియర్ కెమెరా సెటప్ ఉండగా 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 5020 ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
  9.  Samsung Galaxy M12: సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.10,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే ఉంది. సాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అట్రాక్టీవ్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, ట్రెండీ ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
  10.  Nokia 5.4: నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+64జీబీ ధర రూ.15,499. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నోకియా 5.4 రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,000ఎంఏహెచ్. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. డస్క్, పోలార్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు. 

logoblog

Thanks for reading Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Previous
« Prev Post

1 comment:

More ...