బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు రేపే లాస్ట్ డేట్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇన్వెస్టిగేటర్, సూపర్ వైజర్స్, సిస్టెమ్ అనలిస్ట్, సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్, జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్, యూడీసీ, ఎంటీఎస్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెర్ట్ మరియు యంగ్ ప్రొఫేషనల్ విభాగాల్లో ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లై చేసుకునే సందర్భంలో అభ్యర్థులు ఈమెయిల్ ఐడీని సరి చూసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు:
- ఇన్వెస్టిగేటర్ (Investigator)-300
- సూపర్ వైజర్ -50
- సిస్టెమ్ అనలిస్ట్-04
- సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-04
- జూనియర్ డొమైన్ ఎక్ప్పెర్ట్-29
- జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-41
- యూడీసీ-04
- ఎంటీఎస్-18
- Subject Matter Expert – ఎస్ఎంఈ- 07
- యంగ్ ప్రొఫెషినల్స్-10
వేతనాల వివరాలు:
- -ఇన్వెస్టిగేట్ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.24 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
- -సూపర్ వైజర్-రూ.30 వేలు
- -సిస్టెమ్ అనలిస్ట్-రూ.లక్ష
- -సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-రూ. 80 వేలు
- -జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-రూ. 80 వేలు
- UDC-రూ. 22 వేలు
- ఎంటీఎస్-రూ.15 వేలు
- ఎస్ఎంఈ-రూ. 80 వేలు
- యంగ్ ప్రొఫేషినల్స్-రూ.70 వేలు
విద్యార్హతల వివరాలు: వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా అప్లై చేయాలంటే:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://becilmol.cbtexam.in వెబ్ సైట్లో ఈ నెల 22లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు రూ. 955ను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారికి రూ. 670ని ఫీజుగా నిర్ణయించారు.
No comments:
Post a Comment