బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మొత్తం 1679 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1679 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ ఉద్యోగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ తదితర మూడు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి,
- Skilled Manpower: ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్ తదితర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. NCVT, SCVT నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఎలక్ట్రికల్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
- Un-Skilled Manpower: ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసైన్ వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి.
- Semi Skilled: 12వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డీసీఏ, పీజీడీసీఏ కోర్సుల్లో ఏడాdr కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లిష్, హింది టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా అప్లై చేయాలంటే:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.beciljobs.com వెబ్ సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
BECIL Online Application-Direct Link
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 590ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ. 295గా నిర్ణయించారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
No comments:
Post a Comment