బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 511 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మేనేజర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు ఆఖరి తేదీ ఏప్రిల్ 29. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Amazon Summer Offers: On AC's, Refrigerators & more-Upto 50% off
Amazon FAB FEST SALE: Footwear- Upto 70% off
Amazon: Upto 40% off on Televisions
ఖాళీల వివరాలు
- సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్స్ విభాగంలో అత్యధికంగా 407 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ మేనేజర్ గా ఏదైనా బ్యాంకులో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 24 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
- ఈ రిలేషన్ షిప్ మేనేజర్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా కోర్సులో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
- టెర్రిటరీ హెడ్స్ విభాగంలో 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంబంధిత విభాగంలో ఆరేళ్ల అనుభవం ఉండాలి. అందులో రెండేళ్లు టీమ్ లీడర్ గా పని చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- గ్రూప్ హెడ్స్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రాడక్ట్ హెడ్స్ (ఇన్వెస్ట్‌మెంట్, రిసెర్చ్) విభాగంలో ఒక ఖాళీ, ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ హెడ్ విభాగంలో ఒక ఖాళీ, డిజిటల్ సేల్స్ మేనేజర్ విభాగంలో మరో ఖాళీ, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అనుభవం తదితర ఇతర పూర్తి అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
పరీక్ష ఫీజు: అభ్యర్థులు రూ.600ను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు రూ. 100ను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు.
No comments:
Post a Comment