APSSDC skill connect drive | ఆంధ్రప్రదేశ్‌లోని అమర్ రాజా బ్యాటరీస్‌లో ఉద్యోగాలున్నాయి. ఈ సంస్థలో ఖాళీల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకోండి.
1. అమర్ రాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లాలోని యూనిట్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్‌లో వెల్లడించింది.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149
2. ఈ ఉద్యోగాల భర్తీకి కడప జిల్లా పులివెందులలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. మెషీన్ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 పోస్టులున్నాయి.
3. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2021 ఏప్రిల్ 8న ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలనుకునేవారు 2021 ఏప్రిల్ 6 లోగా https://www.apssdc.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
4. విద్యార్హతల వివరాలు చూస్తే ఎస్‌ఎస్‌సీ పాస్ కావాలి. ఇంటర్, ఐటీఐ పాస్ అయినా, ఫెయిల్ అయినా అప్లై చేయొచ్చు. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
5. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: ఎన్‌ఏసీ బిల్డింగ్, కదిరి-జమ్మలమడుగు హైవే, పులివెందుల. ముందుగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు 2021 ఏప్రిల్ 8 ఉదయం 9 గంటల్లోగా రిపోర్ట్ చేయాలి.
6. ఎంపికైన వారికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్‌లో పోస్టింగ్ లభిస్తుంది. వేతనం రూ.10,500 లభిస్తుంది. దీంతో పాటు ఈఎస్ఐ, బస్సు సదుపాయం, సబ్సిడైజ్డ్ హాస్టల్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి.
7. ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు.
8. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.
No comments:
Post a Comment