ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అమర్ రాజా సంస్థలో 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon: Upto 50% off on Air Conditioners
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ నుంచి వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థలో దాదాపు 300 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి వారం పాటు శిక్షణ అందించనున్నారు. ఎంపికైన వారు చిత్తూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెషిన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,300 వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇతర అలవెన్స్ లు సైతం అందించనున్నారు. సబ్సిడీపై ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి సదుపాయం కల్పించనున్నారు.
ఇంటర్వ్యూ వివరాలు:
ఇంటర్వ్యూలను Akhinav Consultancy Services Private Limited, 40-27-88/1, Lohiya Towers, Opp: Nirmala Convert, Patamata, Vijayawada, CRDA Region చిరునామాలో నిర్వహించున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 ఉదయం 10 గంటలకు ఆ చిరునామాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ నెల 25లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వారం పాటు ట్రైనింగ్ ఉంటుంది. వారు చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 8179541641 నంబరును సంప్రదించాలని సూచించారు.
Amazon: Upto 50% off on Beds, Wardrobes, Sofas & more
No comments:
Post a Comment