Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని రోజుల ఈ పథకం విషయంలో నెల కొన్న గందరగోళానికి తెరపడింది. వాస్తవానికి ఈ నెల 9న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయాల్సి ఉంది. అయితే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అప్లై చేసుకోవడంలో ఆలస్యం కావడంతో జగనన్న విద్యాదీవెన డబ్బులు జమ కావడం ఆలస్యమైంది. దీంతో ఏమైందో తెలియక లబ్ధిదారులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని సర్కార్ తెలిపింది. దాదాపు పది లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Flipkart Cooling Days: ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలలో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. నాలుగు త్రైమాసికాలకు డబ్బు ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి సంబంధిత ఫీజు కట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులే నేరుగా ఫీజులు నేరుగా చెల్లించడం వలన కాలేజీల్లో విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకునేందుకు వీలు పడుతుందన్నది సర్కారు భావన.
రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద వసతి, భోజన ఖర్చులను ఆర్ధిక సాయం చేస్తుంది. విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యాసంవత్సరానికి అయ్యే వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి రూ.10వేలు ఇస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించదు.
Flipkart Cooling Days: ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
No comments:
Post a Comment