ANDHRA PRADESH GRAMA VOLUNTEER RECRUITMENT 2021: ఏపీలోని మరో జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత దగ్గర చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడం, వాటి ద్వారా లబ్ధిపొందడం చాలా సులభతరం అయ్యింది. దీంతో పాటు స్థానికంగా ఉండే లక్షలాది మంది యువతకు ఉపాధి సైతం లభిస్తోంది. ఈ వాలంటీర్ ఉద్యోగాలకు ఏర్పడుతున్న ఖాళీలను జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న పలు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న 48 వాలంటీర్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంకా వయస్సు విషయానికి వస్తే ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 35 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు, ఎంపిక విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోగా ఆన్ లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ gswsvolunteer.apcfss.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పథకాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహన, అనుభవం, నాయకత్వ లక్షణాలు, ఇతర నైపుణ్యాలకు ఒక్కో దానికి 25 చొప్పున కేటాయించి జిల్లా సెలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
No comments:
Post a Comment