Andhra Pradesh Government Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పలు పోస్టులకు సంబంధించి ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు.
Flipkart Cooling Days: ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు, అలాగే గ్రామ సచివాలయాల పరిధిలో ఎనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ 6,099 పోస్టులు, 6,000 పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఏపీపీఎస్సీకి పోస్టుల వివరాలు పంపి భర్తీ చేస్తామన్నారాయన.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సచివాలయాల్లో యనిమల్ హస్బెడరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టుల త్వరలో భర్తీ కానున్నాయి.
అలాగే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ ఏర్పాటుకు ప్రభుకసరత్తు చేస్తోంది. 2021 జూన్ 1 నాటికి ఈ భవనాలన్నీ సిద్ధం కావాలని సీఎం ఆదేశించడంతో.., కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులు భర్తీకానున్నాయి.
Flipkart Cooling Days: ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
ఉగాది సందర్భంగా విడుదల చేసే జాబ్ క్యాలెండర్లో 6వేల పోలీస్ జాబ్స్ పోస్టులకం సంబంధించిన ప్రకటన కూడా ఉండే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్-2) పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.
No comments:
Post a Comment