UIDAI: ఆధార్ కార్డు ఎక్కడైనా పోయిందా? అయితే దానిని ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమోనని భయంగా ఉందా? అయితే ఇలా చేయడం ద్వారా మీ కార్డును లాక్ చేయండి. అవసరం ఉన్నప్పుడు మళ్లీ అన్ లాక్ చేసుకుని వాడుకోండి.
ఆధార్ కార్డు ఈ రోజుల్లో నిత్యవసరమైన గుర్తింపు కార్డుగా మారింది. ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా ఏ స్కీంకు అప్లై చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నా టెస్ట్ చేయించుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే.
అయితే ఒక వేళ ప్రమాదవశాత్తు ఆధార్ కార్డు పోతే ఎలా అన్న అందోళన అందరిలో ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- ఇందు కోసం మొదట https://resident.uidai.in/ ని ఓపెన్ చేయాలి.
- 'మై ఆధార్' విభాగంలో 'ఆధార్ సర్వీస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అందులో మీకు Lock/Unlock Biometrics అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి.
- అనంతరం మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.
- క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- OTP ఎంటర్ చేసిన తర్వాత, బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ఎంపిక ఉంటుంది.
- తద్వారా బయో మెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు.
No comments:
Post a Comment