UPSC Recruitment 2021: యూపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన.. పూర్తి వివరాలివే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏప్రిల్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Amazon Smartphone Upgrade Days sale
ఖాళీల వివరాలు.
- -అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్) విభాగంలో 14 పోస్టులు ఉన్నాయి.
- -అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ): 2 పోస్టులు ఉన్నాయి
- -అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ): 11 పోస్టులు ఉన్నాయి
- -అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ): 1 పోస్ట్ ఉంది.
ఇతర వివరాలు.
-అయితే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులు రూ. 25ను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి ఈ ఫీజును చెల్లించే అవకాశాన్ని కల్పించారు.
-ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment