NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 14, 2021

Student Credit Cards: విద్యార్థులకూ ప్రత్యేక క్రెడిట్​ కార్డులు-లాభాలివే

  NewNotifications       Mar 14, 2021

Student Credit Cards: విద్యార్థులకూ ప్రత్యేక క్రెడిట్​ కార్డులు-లాభాలివే

కొన్ని బ్యాంకులు 18 ఏళ్లు దాటిన కళాశాల విద్యార్థులకు క్రెడిట్​ కార్డులను అందిస్తున్నాయి. ఎటువంటి ఆదాయం లేకున్నా సరే, తక్కువ వడ్డీ రేటుకే 5 సంవ్సతరాల కాలపరిమితితో ఈ క్రెడిట్​ కార్డులను అందిస్తుండటం విశేషం. అయితే ఈ స్టూడెంట్​ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు సాధారణ క్రెడిట్ కార్డు కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి పే స్లిప్​ లేదా ఐటిఆర్ అవసరం లేదు. మీరు తీసుకున్న అప్పును సకాలంలో చెల్లిస్తే రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ క్రెడిట్​ కార్డులు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.

క్రెడిట్ లిమిట్ ఎంత?

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియాతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా స్టూడెంట్​ క్రెడిట్​ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఇతర క్రెడిట్ కార్డులతో పోలిస్తే, విద్యార్థి క్రెడిట్ కార్డులు చాలా తక్కువ క్రెడిట్ లిమిట్​తో వస్తాయి. దీని క్రెడిట్ లిమిట్​ రూ.2000 నుండి రూ.25000 మధ్య ఉంటుంది. విద్యార్థులకు సరైన ఆదాయం ఉండదు కాబట్టి వారు ఎక్కువగా ఖర్చు చేయకుండా, రుణ ఉచ్చులో చిక్కుకోకుండా నివారించేందుకు గాను ఈ పరిమితిని విధించాయి. అయితే, వీటికి ఎటువంటి ప్రాసెసింగ్​ ఫీజును వసూలు చేయట్లేదు. అంతేకాక, వీటికి వార్షిక రుసుము కూడా చాలా తక్కువ. స్టూడెంట్ క్రెడిట్ కార్డు దరఖాస్తు కోసం బర్త్​ సర్టిఫికేట్​, స్టూడెంట్​ ఐడెంటిటీ కార్డు, రెసిడెన్సీ ప్రూఫ్​, పాస్​పోర్ట్​ సైజు ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్స్​ను సంబంధింత బ్యాంకుకు సమర్పించాలి.

స్టూడెంట్​ క్రెడిట్​ కార్డును అందిస్తున్న బ్యాంకులు ఇవే

SBI Student Plus Advantage Credit Card: ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక క్రెడిట్ కార్డ్. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఎస్‌బిఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ కార్డు పొందవచ్చు. ఎడ్యుకేషన్​ లోన్​ను సకాలంలో చెల్లించే వారికి 20 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ లభిస్తుంది. ఈ కార్డుకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీనితో ఏదైనా పెట్రోల్ పంపు వద్ద 2.5 శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు పొందవచ్చు. మొత్తం లిమిట్​లో 80% నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను EMI లకు మార్చడానికి ఫ్లెక్సిపే ఆప్షన్​ కూడా ఎంచుకోవచ్చు.

ICICI Bank Student Travel card: ఐసిఐసిఐ బ్యాంక్ స్టూడెంట్ క్రెడిట్ కార్డు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది విద్యార్థుల జీవన వ్యయాలన్నిటితో పాటు ట్యూషన్​ ఫీజు/ హాస్టల్ ఫీజు చెల్లించడం, విమాన టిక్కెట్లను కొనడం వంటి కొనుగోళ్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్టూడెంట్ ట్రావెల్ కార్డ్ విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ ఎంపిక. ఈ కార్డుతో USD, EUR, GBP, AUD, CAD వంటి ఐదు వేర్వేరు కరెన్సీలలో నగదు లావాదేవీలు జరపవచ్చు.

HDFC Multicurrency Platinum ForexPlus Chip Card: ప్రముఖ ప్రైవేటు దిగ్గజ బ్యాంకు హెడ్​డీఎఫ్​సీ కూడా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డును అందిస్తుంది. దీనితో వారు వివిధ స్టోర్స్‌లో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా 22 వేర్వేరు కరెన్సీలలో లావాదేవీలను నిర్వహించవచ్చు. అంతేకాక, ఇది మీకు రూ.5 లక్షల వరకు పూర్తి బీమాను అందిస్తుంది.

HDFC Student Add-on Card: HDFC స్టూడెంట్ యాడ్-ఆన్ కార్డ్ సాధారణ క్రెడిట్ కార్డు మాదిరిగానే పనిచేస్తుంది. 18 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. యాడ్-ఆన్ కార్డుపై ఖర్చులు పేరెంట్ కార్డ్ నెలవారీ స్టేట్‌మెంట్‌లో చేర్చబడతాయి. ఫలితంగా, తల్లిదండ్రులు తమ పిల్లల ఖర్చులను సులభంగా ట్రాక్ చేయవచ్చు. యాడ్-ఆన్ కార్డులతో ఆన్‌లైన్​, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ కొనుగోళ్లు చేయవచ్చు.

logoblog

Thanks for reading Student Credit Cards: విద్యార్థులకూ ప్రత్యేక క్రెడిట్​ కార్డులు-లాభాలివే

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...