స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI), న్యూఢిల్లీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI), న్యూఢిల్లీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 101 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్స్, జూనియర్ కన్సల్టెంటెంట్స్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
యంగ్ ప్రొఫెషనల్స్: విభాగంలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రొజెక్ట్ అండ్ అడ్మిన్ విభాగంలో 28, అథ్లెట్ రిలేషన్ మేనేజర్ విభాగంలో 21, లీగల్ విభాగంలో మరో 5 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అడ్మిన్, అథ్లెట్ రిలేషన్ మేనేజర్ విభాగాలకు అప్లై చేసే అభ్యర్థులు బీటెక్/ఎంబీఏ చేసి ఉండాలి. దీంతో పాటు స్పోర్స్ట్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తో రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమో పూర్తి చేసిన వారు సైతం ఆయా పోస్టులకు అప్లై చేయొచ్చు.
లీగల్ విభాగంలోని ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎల్ఎల్బీ లేదా ఎల్ఎల్ఎం కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పోర్ట్స్ లాలో స్పైషలైజేషన్ చేసిన వారు కూడా అప్లూ చేయొచ్చు. ఈ అన్ని పోస్టులకు ఏడాది అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు దరఖాస్తు చేసుకునేనాటికి 35 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ. 60 వేల వరకు వేతనం అందిస్తారు. అప్లై చేయడానికి మార్చి 20 ఆఖరి తేదీ.
జూనియర్ కన్సల్టెంట్లు:
మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పర్ఫార్మెన్స్ మానిటరింగ్ విభాగంలో 30, ఇన్ ఫ్రా విభాగంలో 17 ఖాళీలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మానిటరింగ్ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్ఫ్రా విభాగంలోని ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సివిల్ లో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగాల్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అభ్యర్థుల గరిష్ట వయస్సు 55 ఏళ్లు. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఎలా ఎంపిక చేస్తారంటే:
మొదట అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు sportsauthorityofindia.nic.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
No comments:
Post a Comment