NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 2, 2021

RBI Recruitment 2021 @841 Vacancies

  NewNotifications       Mar 2, 2021

RBI Recruitment 2021-టెన్త్ పాస్ అయ్యారా? ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. టెన్త్ పాస్ అయినవారు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. మరి ఆర్‌బీఐలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

RBI Office Attendant Recruitment 2021: అప్లై చేయండిలా

  • అభ్యర్థులు ముందుగా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • అందులో Current Vacancies ట్యాబ్ క్లిక్ చేసి Vacancies పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Recruitment for the post of Office Attendants - 2020 పైన క్లిక్ చేయాలి.
  • ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
  • ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
  • అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading RBI Recruitment 2021 @841 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...