PRC-పిఆర్సి ఫిట్మెంటు 55 శాతం అమలు చేయాలి: ఎపి జెఎసి డిమాండ్
ప్రభుత్వం వెంటనే పిఆర్‌సి ఫిట్మెంటు 55 శాతం అమలు చేయాలని ఎపి జెఎసి చైర్మన్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో పిఆర్‌సి ఫిట్మెంటును విడుదల చేసిన నేపథ్యంలో ఎపిలో కూడా పిఆర్ సి నివేదకను ప్రభుత్వానికి సమర్పించామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఎపి జెఎసి పక్షాన ఈ ఫిట్మెంటు జులై 1, 2018 నుంచి అమలు చేయాలని కోరారు. విజయవాడలోని ఎజ ఒ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఎపి జెఎసి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కార్డులు పూర్తిగా అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉగ్యోగులను దశలవారీ రెగ్యులర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి జెఎసి సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, జెఎసి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment