NTA DU Recruitment 2021 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA 1145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1145 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లేదా ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
NTA DU Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
- జూనియర్ అసిస్టెంట్ - 236
- టెలిఫోన్ ఆపరేటర్ - 08
- అసిస్టెంట్ - 80
- స్టెనోగ్రాఫర్ - 77
- యోగా ఆర్గనైజర్ - 01
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 05
- నర్స్ - 07
- అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ - 01
- జూనియర్ ఇంజనీర్ సివిల్ - 05
- జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 05
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 04
- సీనియర్ అసిస్టెంట్ - 45
- హిందీ ట్రాన్స్‌లేటర్ - 02
- పర్సనల్ అసిస్టెంట్ - 09
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 16
- సోషల్ వర్కర్- 03
- ఫిజియోథెరపిస్ట్ - 02
- ఎక్స్-రే టెక్నీషియన్ - 02
- హార్టికల్చరిస్ట్- 01
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ - 58
- అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ - 01
- స్పోర్ట్ కోచ్ - 01
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 17
- ఫార్మసిస్ట్ - 05
- టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ - 19
- టెక్నికల్ అసిస్టెంట్ హెల్త్ సెంటర్ - 02
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 2
- టెక్నికల్ అసిస్టెంట్ విభాగం - 51
- శానిటరీ ఇన్‌స్పెక్టర్ - 01
- తబ్లా సహచరులు - 12
- పఖావాజ్ ప్లేయర్ - 01
- సారంగి సహాయకులు - 02
- వయోలిన్ సహాయకులు - 02
- మృదంగం సహచరులు - 01
- హార్మోనియం సహాయకులు - 01
- తన్పుర సహచరులు - 04
- ల్యాబరేటరీ అసిస్టెంట్ - 53
- వర్క్ అసిస్టెంట్ - 03
- అసిస్టెంట్ స్టోర్ - 02
- సేల్స్ మాన్ DHMI- 02
- లైబ్రరీ అసిస్టెంట్ -05
- ప్రైవేట్ సెక్రెటరీ - 02
- సెక్యూరిటీ ఆఫీసర్ - 01
- జూనియర్ అసిస్టెంట్ స్టోర్ - 1
- జూనియర్ వర్క్ అసిస్టెంట్ (ఇంజనీరింగ్ సర్వీస్) - 35
- లైబ్రరీ అటెండెంట్ - 109
- హెల్త్ అటెండెంట్ - 18
- ల్యాబరేటరీ అటెండెంట్ - 152
- ఇంజనీరింగ్ అటెండెంట్ - 52
- మెడికల్ ఆఫీసర్ - 15
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 06
NTA DU Recruitment 2021: Important Dates
- దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 23
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 16 రాత్రి 11.50 గంటలు
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 మార్చి 17
- దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి- 2021 మార్చి 18 నుంచి మార్చి 20
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
- ఆన్‌లైన్ టెస్ట్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
NTA DU Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- విద్యార్హతలు- ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
- వయస్సు- పోస్టుల వారీగా అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు వేర్వేరుగా ఉంది.
- ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్
- దరఖాస్తు ఫీజు- జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
No comments:
Post a Comment