కేంద్ర కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ. నాలుగు కొత్త కార్మిక చట్టాలను త్వరలో అమల్లోకి తెస్తోంది. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలనీ, 3 రోజులు వీకాఫ్ ఉండాలనే ప్రతిపాదన ఉంది. అలాగే. ఓవర్ టైమ్ లిమిట్ అంశం కూడా ఉంది. ఒక్కటి మాత్రం ఖాయం. ఉద్యోగుల కాస్ట్ టు కంపెనీ (CTC)లో మార్పులు చేయబోతున్నారు. ఫలితంగా ఉద్యోగుల చేతికి వచ్చే శాలరీపై ప్రభావం పడబోతోంది. హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం. కొత్త కార్మిక చట్టాల వల్ల కంపెనీలు తమ ఉద్యోగుల CTCలను మార్చాల్సి ఉంటుంది. అలాగే. LTA, హౌస్ రెంట్, ఓవర్ టైమ్, రవాణా ఛార్జీలు వంటివి మొత్తం CTCలో 50 శాతానికి మాత్రమే పరిమితం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు. వేతనాలు అనే పదానికి నిర్వచనం (definition of the term 'wages') కూడా 2019 వేతనాల చట్టాల ప్రకారం మార్చబోతున్నారు. ఇందులో బేసిక్ పే, కరవు భత్యం, నిలుపుదల చెల్లింపు (retention payment) వంటివి ఉంటాయి.
రవాణా భత్యం (conveyance allowance), HRA, పెన్షన్, PF కంట్రిబ్యూషన్, ఓవర్ టైమ్, గ్రాడ్యుటీ, స్టాట్యుటరీ బోనస్ వంటివి మాత్రం వేతనాల నిర్వచనం నుంచి తప్పించనున్నారు. ఇవన్నీ 50 శాతానికి మించకుండా చేయనున్నారు. ఒకవేళ మించితే. అదనపు మొత్తాన్ని వేతనం కింద లెక్కించనున్నట్లు తెలిసింది. సింపుల్‌గా చెప్పాలంటే. CTCలో ఈ అదనాలను 50 శాతానికి పరిమితం చేయడం వల్ల. ఉద్యోగికి నెలవారీ చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఓవర్ టైమ్ రూల్స్ కూడా మారనున్నట్లు తెలిసింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం. 15 నిమిషాలకు మించి అదనంగా పనిచేస్తే. దాన్ని ఓవర్ టైమ్ కింద లెక్కలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. అందువల్ల కంపెనీలు ఆ ఓవర్ టైమ్ కి కూడా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. సపోజ్ ఓ ఉద్యోగి తన షిఫ్ట్ ప్రకారం పనిచేసి. షిఫ్ట్ పూర్తయ్యాక. అదనంగా మరో 15 నిమిషాలకు మించి పనిచేస్తే. అతనికి ఓవర్ టైమ్ వేతనం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ ఈ కొత్త చట్టాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ. మార్పులూ, చేర్పులూ చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఈ కొత్త రూల్స్ అమలు దిశగా చర్యలుంటాయని తెలిసింది.
No comments:
Post a Comment