NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో ప్రముఖ సంస్థల నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 21లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) విభాగంలో 25, మేనేజ్మెంట్ ట్రైనీ(ఎలక్ట్రికల్) విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నాయి.
- Management Trainee (Civil) (E-1): ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి.60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏప్రిల్ 21 నాటికి దరఖాస్తుదారుల వయస్సు గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి.
- Management Trainee (Electrical) (E-1): ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇందుకు సమానమైన కోర్సులో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 22 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ లింక్ అందుబాటులో ఉంటుంది.
- దరఖాస్తులను ఏప్రిల్ 21 వరకు మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు ఆ తేదీ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్: https://www.nbccindia.com/
- అప్లికేషన్ డైరెక్ట్ లింక్: https://www.nbccindia.com/webEnglish/jobs
No comments:
Post a Comment