NABARD Student Internship Scheme | పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రకటించింది. ఎంపికైనవారికి నెలకు రూ.18,000 స్టైపెండ్ ఇవ్వనుంది. దరఖాస్తు గడువు రేపే ముగుస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.
1. పీజీ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 5 చివరి తేదీ.
2. రాబోయే అంటే 2021-22 విద్యాసంవత్సరానికి మొత్తం 75 ఇంటర్న్‌షిప్ ఖాళీలను ప్రకటించింది నాబార్డ్. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు ఎవరైనా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఇది రెండు నెలల ఇంటర్న్‌షిప్ మాత్రమే. నెలకు రూ.18,000 స్టైపెండ్ లభిస్తుంది.
3. నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.nabard.org/ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
4. ఎంపికైనవారు 2021 ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. ఇంటర్న్‌షిప్ గడువు 2 నెలలు. ఎంపికైనవారికి నెలకు రూ.18,000 స్టైపెండ్ లభిస్తుంది.
5. విద్యార్హతల వివరాలు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తుండాలి. వీరితో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.
6. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు షార్ట్ టర్మ్ టాస్కులు పూర్తి చేయాలి. వీటితో పాటు ప్రాజెక్ట్స్ లేదా స్టడీస్ ఉంటాయి. ఇవన్నీ నాబార్డ్ బ్యాంకుకు సంబంధించినవే ఉంటాయి.
7. వీటితో పాటు రూరల్ మార్కెట్లు, హోమ్‌స్టే, రూరల్ టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, మైక్రో ఏటీఎం, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ లాంటివాటిపైనా ప్రాజెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది.
8. ఎంపికైనవారికి నెలకు రూ.18,000 చొప్పున రెండు నెలలు స్టైపెండ్‌తో పాటు ఫీల్డ్ అలవెన్స్ లభిస్తుంది. విద్యార్థుల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినవారికే ఈ బెనిఫిట్స్ లభిస్తాయి.
No comments:
Post a Comment