భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్‌వైజర్ (బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్ 2021 విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs వివరాలు:
పోస్టుల సంఖ్య: 502
ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
- డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.
- సూపర్‌వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్ మేనేజ్‌మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా, స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
- రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.
వేతనం:
- సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
Important Dates:
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2021
- రాత పరీక్ష తేది: మే 16, 2021.
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)
పరీక్ష కేంద్రాలు:
- సికింద్రాబాద్, విశాఖపట్నం
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.mesgovonline.com/mesdmsk
No comments:
Post a Comment